Vastu Tips: డబ్బులేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారా, అయితే ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించండి. ఇది ఎలా పెడతారో తెలుసుకొని, 41 శుక్రవారాలు ఇలా చేసి చూడండి..
Image used for representational purpose | (Photo Credits: PTI)

Vastu Tips: సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుందా, అప్పులు తీరకుండా వడ్డీ పెరిగి పోతూ ఉందా, వ్యాపారం లో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి, అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి, బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి, కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టిన వారికి, అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం మంచిపరిహారం అని చెప్పాలి.

ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి :-

ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకొని పసుపు కుంకుమ రాసి నెలపైన బియ్యం పిండి పసుపు కుంకుమ తో ముగ్గు వేసి దానిపైన ప్రమిధలు ఒకదాని పైన ఒకటి ఒక్కటిగా పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు పైనపసుపు కుంకుమ చల్లాలి ఒక చిన్న ప్రమిధలు ఒకదాని పైన ఒకటి పెట్టి పసుపు కుంకుమా పూలు పెట్టి ప్రమిధలో నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి. లక్ష్మీ దేవి సోత్రం చదవాలి.

Surya Grahan: దీపావళి రోజే సూర్య గ్రహణం, 27 సంవత్సరాల్లో ఇదే తొలిసారి, పండితులు హెచ్చరిస్తున్నారు, ఎందుకో తెలుసుకోండి..

 

శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిధల లోని ఉప్పు తీసి నీటిలో కలిపి ఇంటి బయట ఎవరూ తిరగని ప్రదేశంలో పోయాలి. అవకాశం ఉన్నవాళ్లు నదిలో కలపవచ్చు, ప్రమిధలు మార్చాల్సిన పని లేదు ప్రతి వారం అవి వాడుకోవచ్చు , ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి…అలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారం కానీ 21 కానీ 41 శుక్రవారాలు కానీ అనుకోని ఇంట్లో చేయాలి.

ఏ దిక్కులో ఐశ్వర్య దీపం వెలిగించాలి

ఈ ఉప్పు దీపం ఈశాన్యం మూల పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది..41 శుక్రవారం ఈ ఉప్పు దీపం పెట్టే వారికి శాశ్వతంగా ఇబ్బందులు తొలగిపోతాయి. ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు.