Baba Vanga (Photo Credits : Wikimedia )

ఆమెకు రెండు కళ్లు కనబడవు, కానీ భవిష్యవాణి చెప్పడంలో ఆమెకు ఆమె సాటి, ఆమె చెప్పిన విషయాల్లో చాలావరకూ నిజం అయిన ఘటనలు గతంలో చాలా ఉన్నాయి. దీంతో ఆమె భవిష్యవాణిపై నమ్మకం పెంచుకున్న ప్రజలు. మరి 2022 సంవత్సరానికి వాంగాబాబా జ్యోతిషం ఏం చెబుతోంది? అసలు వాంగబాబా జ్యోతిషం ఏమిటి? అన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం.

2022 ఏడాదిలో వాంగబాబా జ్యోతిషం అంచనా ఇదే..

>> 2022లో ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు, సునామీ, ఇతర ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు అనేక ఆసియా దేశాలలో వరదలతో సహా ప్రకృతి వైపరీత్యాల పెరుగుదల ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

>> గ్రహాంతర దండయాత్ర. ‘ఓమువామువా’ అనే గ్రహశకలం భూమిపై జీవం కోసం వస్తుంది. అందులోని గ్రహాంతరవాసులు మన నగరాలపై బాంబులతో దాడి చేసి, మానవులను ఖైదీలుగా పట్టుకోవచ్చు.

>> సైబీరియా నుంచి ప్రాణాంతకమైన వైరస్ వస్తుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో వైరస్‌లు విజృంభిస్తాయి.

>> నీటి కొరత. జనాభా..కాలుష్యం పెరుగుతున్నందున, చాలా మంది ప్రజలు సరైన తాగునీరు కోసం కష్టపడతారు.

>> అంగారకునిపై మానవుల కాలనీ ఏర్పడుతుంది.. ఇది అణ్వాయుధ దేశంగా పెరిగి 2170 తర్వాత భూమి నుంచి స్వాతంత్రం పొందడానికి ప్రయత్నిస్తుంది

>> మిడతల దాడి భారతదేశంలో పంటలపై దాడి చేసి కరువును కలిగిస్తుంది.

>> భూ ప్రపంచంపై డ్రాగన్‌ ఆధిపత్యం సాధిస్తుంది. మానవత్వం మరచి ప్రవర్తించే ఈ డ్రాగన్‌కు వ్యతిరేకంగా మూడు పెద్ద శక్తులు. ఏకం అవుతాయి. (డ్రాగన్‌ అంటే చైనా దేశంగా భావిస్తున్నారు)

>> ప్రజలు స్క్రీన్‌ల ముందు మరింత ఎక్కువ సమయం గడుపుతారు. చాలామంది వాస్తవ దృశ్యాలకు వర్చువల్ రియాలిటీకి మధ్య గందరగోళానికి గురౌతారు

>> వాతావరణ మార్పుల కారణంగా మానవజాతి తీవ్ర కరువు బారిన పడుతుంది. ప్రజలు బీటిల్స్, ఆకులు, మట్టిని తిని చనిపోతారు.

>> మంచుకొండల్లోని హిమనీనదాల్లో ప్రాణాంతక వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొంటారు. ఇది వేగంగా వ్యాపించి భారీగా మానవుల, జంతువుల మరణాలకు కారణమవుతుంది.

ఎవరీ వాంగ బాబా…?

బల్గేరియాలోని పెట్రిచ్‌లో 1911, జనవరి 31న బాబా వాంగ జన్మించారు. ఈమె 1996 ఆగస్టు 11న మరణించారు. 12 ఏళ్ల వయసులో ఓ టోర్నడోలో కొట్టుకుపోయినా, ప్రాణాలతో వాంగ బయటపడ్డారు. బాబా వాంగ కళ్లలో ఇసుక పడటంతో చూపు కోల్పోయారు. ఈమె తన 16వ ఏట నుంచే భవిష్యవాణి మొదలుపెట్టారు. ఇదెలా ప్రారంభం అయిందంటే.. ఆమె తండ్రి పెంచుతున్న గొర్రెల మంద నుంచి ఓ గొర్రెను దొంగలు ఎత్తుకెళ్ళారు. దీంతో ఎత్తుకెళ్లిన చోటును వివరాలతో సహా ఊహించి చెప్పారు వాంగ. ఆ తరువాత 30 ఏళ్ల నాటికి ఆమె అతీంద్రియ శక్తులు మరింత బలమైనవిగా మారాయి. బల్గేరియా వాసులు ఆమె మాటలను నమ్మారు. ఆమె చెప్పిన ఎన్నో జోస్యాలు నిజం కావడంతో వాంగను ‘నోస్ట్రడామస్‌ ఆఫ్‌ ద బాల్కన్స్‌’గా జనం పిలిచుకునే వారు. ఆమె ఊహించిన చెప్పిన జోస్యాల్లో 68 శాతం వరకూ నిజమయ్యాయనే వాదన ఉంది. అమెరికాలోని ట్విన్‌ ట్వవర్స్‌ను విమానాలతో కూల్చేస్తారని 1989లోనే వాంగ చెప్పారు. అదేవిధంగా.. 2016లో యూరప్‌ పై ముస్లింలు దాడి.. ఇది యుద్ధానికి దారి తీసి చాలా మంది మృత్యువాత పడతారని 1996కు ముందే వాంగ జోస్యం చెప్పారు. అలాగే సిరియాలో ‘గ్రేట్‌ ఇస్లామిక్‌ వార్‌’ మొదలై 2043 నాటికి రోమ్‌పై పూర్తి ఆధిపత్యం సాధిస్తుందని వెల్లడించిన వాంగ..2018 నాటికి అమెరికాను వెనక్కి నెట్టి చైనా శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని కూడా చెప్పారు.