Mumbai, Feb 3: బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ రమేష్ పవార్ (BMC Deputy Municipal Commissioner Ramesh Pawar) మంచి నీళ్లు అనుకుని శానిటైజర్ తాగేశారు. విద్యా బడ్జెట్‌ను సమర్పించేటప్పుడు అనుకోకుండా ఆయన (Ramesh Pawar) సానిటైజర్ బాటిల్ తాగేశారు. ఈ వీడియో వైరల్ అయింది. వైరల్ అయిన వీడియోలో పవార్ వాటర్ బాటిల్ అనుకుని వేదికపై ఉన్న శానిటైజర్‌ను (sanitiser) తీసుకుని దాన్ని కొద్దిగా తాగినట్టు కనిపించింది. వెంటనే తేరుకున్న పవార్ అవి మంచినీళ్లు కాదని గ్రహించి శానిటైజర్ బాటిల్‌ను పక్కనపెట్టారు.
తొలుత ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న అధికార్లలో ఒకరు పవార్ శానిటైజర్ తాగడాన్ని అడ్డుకున్నా అప్పటికే ఆయన ఒక చుక్క తాగారు. వెనువెంటనే వాటర్ బాటిల్‌ను పవార్‌కు అందించారు. ఈ ఘటన జరిగిన సమయంలో బీఎంసీ విద్యా కమిటీ చీఫ్ సంధ్య దోషీ కూడా అక్కడే ఉన్నారు. ప్రముఖ వార్తా ఏజెన్సీ ANI ఈ వీడియోని ట్వీట్ చేసింది.
ఈ వీడియో సుమారు 5,000 వీక్షణలు, అనేక లైక్‌లు మరియు రీట్వీట్‌లతో వైరల్ అయ్యింది. "బడ్జెట్ను సమర్పించడానికి ముందు ఆందోళన," అంటూ నెటిజన్లు సరదా వ్యాఖ్యలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటన తరువాత, రమేష్ పవార్ హాల్ నుండి బయటకు వెళ్లి కొద్ది సేపటి తర్వాత తిరిగి వచ్చాడు. బడ్జెట్ సమర్పణతో ఆయన కొనసాగారు. కాగా ఆయన ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోలేదని అధికారులు తెలిపారు.
Here's ANI Tweet
I thought that I should drink water before starting my speech so I lifted the bottle & drank. Bottles of water & sanitiser kept there, were similar. So it happened. As soon as I drank it, I realised the mistake & didn't gulp it all the way down: Ramesh Pawar, BMC Jt Commissioner pic.twitter.com/xCKBaTey9v
— ANI (@ANI) February 3, 2021
వాటర్ బాటిల్స్ మరియు శానిటైజర్స్ రెండింటినీ టేబుల్ మీద ఉంచినట్లు బిఎమ్‌సి అధికారులు తెలిపారు.ఈ సంఘటన తరువాత, అధికారులు బడ్జెట్ ప్రెజెంటేషన్ టేబుల్స్ నుండి శానిటైజర్ బాటిళ్లను తొలగించారు ఇదిలా ఉంటే "వాటర్ బాటిల్స్ మరియు శానిటైజర్ బాటిల్స్ రెండూ ఒకేలా కనిపించాయి. కాబట్టి, ఈ పొరపాటు పునరావృతం కాకుండా ఉండటానికి మేము సానిటైజర్ బాటిళ్లను టేబుల్ నుండి తొలగించాము" అని ఒక అధికారి తెలిపారు. జాయింట్ కమిషనర్ (ఎడ్యుకేషన్) అశుతోష్ సలీల్ అందుబాటులో లేనందున రమేష్ పవార్ ఈ ఏడాది విద్యా బడ్జెట్ను సమర్పించారు.