Hyderabad, Sep 9: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మధ్య మొదలయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో గణేశ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భాగ్యనగరంలో గణనాథులు భిన్నమైన ఆకృతుల్లో కనిపిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. ముఖ్యంగా న్యూ బోయిన్ పల్లిలోని కంసారి బజార్ లో ‘రుద్ర యూత్ అసోసియేషన్’ నేతృత్వంలో ప్రతిష్టించిన బోయిన్ పల్లి కా రాజా (Bowenpally ka Raja).. ‘రుద్ర యూత్ గణేశా’ ప్రత్యేక ఆకర్షణగా మారింది (RUDRA Ganesha). ముంబై లాల్ బగీచా ఆలయంలోని లాల్ బాగ్ వినాయకుడిని పోలినట్టు, ఆ గణనాథునికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న బోయిన్ పల్లి రుద్ర వారి వినాయకుడిని చూడటానికి స్థానికులు పోటెత్తుతున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా కాణిపాకం లడ్డు
కాణిపాకం వినాయకుడి గుడి అంతరాలయంలో ఐదు రోజుల పాటు పూజలు చేయించి ప్రత్యేకంగా తెప్పించిన కాణిపాకం లడ్డూ ప్రసాదం రుద్ర గణేశ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Bowenpally ka Raja RUDRA Ganesha
నేడు అన్నదాన కార్యక్రమం
గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు మధ్యాహ్నం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించనున్నట్టు రుద్ర యూత్ అసోసియేషన్ ప్రధాన ప్రతినిధి సాయి తేజ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో సాయి తేజతో పాటు కీర్తన, వికాస్, శివం, శివ, విగ్నేశ్, సౌరబ్, నిఖిల్, రోహిత్, రవి తేజ, శ్రీకాంత్, జతిన్, మెహుల్, పునీత్ తదితరులు పాల్గొన్నారు.