Groom Welcome by Lighting Cigarette (Screen garb from Viral video)

Ahmadabad, FEB 17: పెండ్లి వేడుక‌లో వ‌రుడి వీడియో (viral video) సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వ‌రుడికి సిగ‌రెట్ వెలిగించి (lighting a cigarette) పెండ్లి వేడుక‌కు వ‌ధువు త‌ల్లితండ్రులు ఆహ్వానిస్తున్న వీడియో నెట్టింట ప్ర‌స్తుతం తెగ వైర‌ల్ అవుతోంది. బ్లాగ‌ర్ జుహీ కే ప‌టేల్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ 57 ల‌క్ష‌ల మంది వీక్షించారు. ఈ వీడియోలో వ‌రుడు కూర్చుని ఉండ‌గా అత్తా మామ‌లు అత‌డికి సిగ‌రెట్ అందించి వారే వెలిగించ‌డం (lighting a cigarette) క‌నిపిస్తుంది. ఈ పెండ్లి వేడుకకు అతిధిగా హాజ‌రైన జుహీ ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు. పెండ్లి కొడుకును స్వీట్లు, బీడీ, పాన్‌తో అత్త‌గారు స్వాగ‌తించిన పెండ్లి వేడుక‌ను ఇప్పుడే చూశాన‌ని ఆమె రాసుకొచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Joohi K Patel (@joohiie)

ద‌క్షిణ గుజ‌రాత్‌లోని కొన్ని గ్రామాల్లో అనుస‌రించే పాత సంప్ర‌దాయం ఇద‌ని, అత‌డు క‌నీసం పొగ‌తాగ‌లేద‌ని, వీడియోలో వారు కేవ‌లం ఆచారం కోసం న‌టించార‌ని చెప్పుకొచ్చారు. ఈ ఆచారంపై నెటిజ‌న్లు పెద‌వివిరిచారు. అస‌లు ఇదేం సంప్ర‌దాయ‌మ‌ని మ‌రికొంద‌రు నొస‌లు చిట్లించారు. అయితే బిహార్‌, ఒడిషాలోనూ ఇలాంటి సంప్ర‌దాయం ఉంద‌ని మ‌రికొంద‌రు యూజ‌ర్లు కామెంట్ చేశారు.