Beijing, August 10: బ్రహ్మంగారి కాలజ్ఞానంలా.. భవిష్యత్తును ముందే ఊహించి చెప్పినవాడు ‘నోస్ట్రాడమస్’. అలాంటి భవిష్యజ్ఞాని వేల ఏండ్ల క్రితం చైనా(China)లోనూ ఉండేవాడు. అతనే లియూ బోవెన్ (LiuBowen). ‘ద టెన్ వర్రీస్’ అనే పేరుతో ఉన్న కవితలో ఆయన భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ముందే చెప్పాడు. అందులో కరోనా(Corona) పుట్టుకను, అంతాన్ని కూడా ఆయన అంచనా వేశారు. ఆ పుస్తకంలో పేర్కొన్న ప్రకారం.. ర్యాట్, క్యాట్ ఇయర్స్ మధ్య కాలంలో భయంకరమైన విపత్తు వస్తుందని, అది డ్రాగన్, స్నేక్ ఇయర్స్ మధ్యకాలంలో అంతమైపోతుందని లియూ ఓ కవితలో పేర్కొన్నాడు. చైనీస్ జొడియాక్ సంవత్సరాల ప్రకారం ర్యాట్ ఇయర్ 2019లో మొదలైంది. క్యాట్ ఇయర్ 2020లో ప్రారంభమైంది. ఈ రెండేళ్ల మధ్య పుట్టిన విపత్తు... కరోనా వైరసే.
ఇక కరోనా అంతమైపోతుందని ఆయన చెప్పిన సంవత్సరాలు(Years)... డ్రాగన్, స్నేక్. జొడియాక్ సంవత్సరాల ప్రకారం .. 2024లో డ్రాగన్ ప్రారంభమవుతుండగా, స్నేక్ 2025లో మొదలవుతోంది. ఈ మధ్య కాలంలోనే పూర్తిగా కరోనా నశిస్తుందని లియూ పేర్కొన్నాడు. అయితే ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి..