Bellary, September 6: ఎవరినైనా తీవ్ర స్థాయిలో తిట్టినప్పుడు ఉప్పు పాతర వేస్తా అంటుంటాం. అయితే, ఇదే మాట ఓ బాలుడి తల్లిదండ్రులకు మూఢనమ్మకంగా మారింది. నీట మునిగి మరణించిన తమ కుమారుడు భాస్కర్(10) మృతదేహానికి ఉప్పు పాతర వేస్తే మళ్లీ బతుకుతాడన్న నమ్మకంతో అతని తల్లిదండ్రులు ఉప్పు పాతర వేశారు. ఈ ఘటన కర్ణాటకలో బళ్లారి (Bellary) తాలూకాలోని సిరివార గ్రామంలో జరిగింది. శేఖర్, గంగమ్మ దంపతుల చిన్న కుమారుడు భాస్కర్ సోమవారం ఈతకు (Swimming) వెళ్లి నీటి గుంతలో పడి మృతి చెందాడు.
మహాబలి వేషంలో ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించిన ఎస్‌బీఐ ఉద్యోగి, ఇంటర్నట్లో వైరల్ అవుతున్న వీడియో
అయితే నీటిలో పడి మరణించిన వారిని రెండు గంటల్లోగా ఉప్పులో కప్పి పెడితే బతుకుతారనే మూఢ నమ్మకంతో తల్లిదండ్రులు సుమారు 4–5 బస్తాల ఉప్పును తెచ్చి మృతదేహంపై కుప్పగా పోశారు. బాలుడు బతికి వస్తాడని దాదాపు 8 గంటల పాటు ఎదురు చూశారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అయ్యింది. ఎంతకీ బాలుడు లేవకపోవడంతో విషన్న వదనాలతో బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.