వినడానికి,చదవడానికి కాస్త వింతగా ఉన్న ఇది నమ్మలేని నిజం. కోడి గుడ్లు కాసే చెట్లు వచ్చేశాయి. మాములుగా కోడి గుడ్డు అనగానే కోడి నుండి వస్తుందని అందరికి తెలుసు. కానీ ఇది నిజం. చెట్ల ద్వారా కోడిగుడ్లను పండిస్తున్నారు. త్వరలో ఇవి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అంటూ సోషల్ మీడియాలో కొన్ని పుకర్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని శాస్త్రవేత్తలు కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు.
Breaking news
Pakistan has cracked the biggest mystery since mankind :))
What come first
Chicken or egg lol#pakistan #Pakistani #egg #chicken #Pakistanis #IndiaKaEvolution #ImranKhan #ARYNewsUrdu #BabarAzam #PTI #PTIGovernment pic.twitter.com/TGcoF8m1cK
— One Off Domain (@myblogtech) December 14, 2021
ముఖ్యంగా పాకిస్తాన్‌లోని కొన్ని మొక్కలు గుడ్లను పండిస్తున్నట్లుగా వస్తున్న వీడియో యూట్యూబ్ మరియు ట్విట్టర్ వంటి అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ చేయబడింది. ఇందులో నిజమెంతో సరిచూసుకోకుండానే నెటిజన్లు ఫేక్ వీడియోపై ఫిదా అయ్యారు.
అయితే, ఆ వాదన నిజం కాదని తేలింది. మరొక క్లెయిమ్-బస్టర్ వీడియోలో, నకిలీ వీడియోలో చూపబడిన గుడ్డు మొక్కలు నిజానికి 'వైట్ బ్రింజాల్' అంటే తెల్ల వంకాయ మొక్కలు అని కనుగొనబడింది. తెల్ల జాతికి చెందిన వంకాయలు ఒక్కోసారి చూడగానే, సరిగ్గా కోడి గుడ్డులా కనిపిస్తుంది. వాస్తవాన్ని తనిఖీ చేసే వీడియోలో, ప్రజలు తెల్ల వంకాయగా గమనించవచ్చు.