Fake Garlic Made With Cement (Credits: X)

Newdelhi, Aug 19: నకిలీ కేటుగాళ్ళ (Fake Sellers) ఆగడాలు శృతిమించుతున్నాయి. మొన్నటివరకూ నకిలీ కోడిగుడ్లు, నకిలీ బియ్యం, నకిలీ నూనెను మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటంఆడిన ఫేక్ గాళ్లు.. ఇప్పుడు మార్కెట్లను నకిలీ వెల్లుల్లితో (Fake Garlic) అతలాకుతలం చేస్తున్నారు. సిమెంట్‌ తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి (Fake Garlic Made With Cement) మహారాష్ట్రలోని అకోలాలో దర్శనమిచ్చింది. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆ వీడియోలో కన్పిస్తున్న వెల్లుల్లిని చూస్తే మామూలు వెల్లుల్లిగానే కన్పిస్తుండటం గమనార్హం.

డెహ్రాడూన్‌ లో ఘోరం.. బస్సులో బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. ఐదుగురు దారుణానికి పాల్పడ్డట్టు ఆరోపించిన బాలిక.. నిందితుల అరెస్ట్

ఎందుకు ఇలా?

వెల్లుల్లి బయటకు మామూలుగా కనిపిస్తున్నప్పటికీ.. దాని పాయ ఒకటి ఒలిచి చూడగా, లోపలి భాగమంతా సిమెంట్‌ తో నిండి గట్టిగా ఉండటం వీడియోలో కనిపిస్తున్నది. సిమెంట్‌ తో చేసిన నకిలీ వెల్లుల్లి అసలు స్టాక్‌ లో కలిపి అమ్మేస్తున్నారు. ధర పెరిగిన నేపథ్యంలో వెల్లుల్లి బరువు పెరుగడానికే కేటుగాళ్లు ఈ ఉపాయం అలోచించినట్టు అనుమానిస్తున్నారు.

‘అసలు అత‌డు మ‌గాడే కాదు’.. రాజ్ తరుణ్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన యువ‌తి.. వీడియో ఇదిగో