Newdelhi, Aug 26: ఈజీగా మనీ (Easy Money) సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కి అంతే ఈజీగా పట్టుబడుతూ ఉంటారు. రైలు ప్రయాణికుల (Railway Passengers) నుంచి ఈజీగా మనీ కొల్లగొట్టాలని ఓ కిలాడీ లేడీ నకిలీ టీటీఈ (Fake TTE) అవతారమెత్తింది. ఎవరికీ అనుమానం రాకుండా గులాబీ రంగు కోట్ వేసుకుని.. టీటీఈలాగా నటించింది. అయితే ఆ యువతి చేస్తున్న చేష్టలతో కొందరు ప్రయాణికులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె నిజమైన టీటీఈ కాదని.. నకిలీ టీటీఈ అని తేల్చారు. ఈ ఘటన శుక్రవారం పాతాళకోట్ ఎక్స్ ప్రెస్ లో చోటు చేసుకుంది.
ఇదేందయ్యా.. ఇది..? హెల్మెట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్ కు జరిమానానా? నోయిడా పోలీసుల వింత నిర్ణయం
Here's Video
Viral Video: Fake Woman TTE Caught by the Railway Police near Jhansi.
Read: https://t.co/9gKN0tBjRt#Jhansi #UttarPradesh #viralnews #viralvideo #Railways #viral pic.twitter.com/DNeOb43050
— Republic (@republic) August 25, 2024
ఎలా దొరికిపోయిందంటే?
రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో టికెట్లు లేని వారిని ఈ కిలాడీ లేడీ టార్గెట్ చేసింది. వాళ్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టింది. జరిమానానా? అని ప్రశ్నించిన వారికి అవును అని చెప్పింది. అయితే, రసీదు ఇవ్వమని అడిగితే, పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆమెపై అనుమానం వచ్చిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, యువతి వసూళ్లకు పాల్పడుతున్న దృశ్యాలను ప్రయాణికులు వీడియో తీసి ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.