Indore, OCT 20: ఉద్యోగం నుంచి తీసేశాడనే కోపంతో యజమానిపై విచిత్రంగా పగతీర్చుకున్నాడు ఓ ఉద్యోగి (Employer). తనను జాబ్ నుంచి తీసేసిన యజమాని పరువు తీయడమే కాదు, ఏకంగా రూ.55వేలు లాస్ చేశాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే..మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) సంతా నుంచి ఇండోర్‌కు (Satna) రెగ్యులర్‌గా నడిచే సుఖేజా బస్సు సర్వీస్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తిని యజమాని ఉద్యోగం నుంచి తీసేశాడు. జాబ్ నుంచి తీసేసే సమయంలో అతనితో గొడవపడ్డాడు. అంతేకాదు అతన్ని దుర్భాషలాడాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఉద్యోగి...తన యజమానికి బుద్దిచెప్పాలనుకున్నాడు. ఇందుకోసం బస్సు ముందు భాగంలో ఉండే డిస్ప్లే బోర్డును (Bus name board) మార్చాడు. గతంలో సుఖేజా బస్సు సర్వీసు (Bus Service) అని ఉండే ఆ బోర్డులో ఓ బూతు పదాన్ని వాడాడు. అంతేకాదు వెళ్తూ వెళ్తూ ఆ డిస్ల్పేను ఆపరేట్ చేసే సీపీయూ పాస్ వర్డ్ ను కూడా మార్చివేశాడు. దాంతో ఆ బూతు పదం బోర్డుతోనే (Cuss Word) బస్సు నడిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
सतना से इंदौर जाने वाली सुखेजा बस सर्विस के मालिक ने अपने एक कंडक्टर को गाली देकर नौकरी से निकाल दिया उसने गाली का बदला किस प्रकार लिया, आप बस डिस्प्ले देखकर समझ जाएंगे उसने जाते जाते display CPU का पासवर्ड बदल दिया है । अब नया CPU इंस्टाल होगा जिसकी कीमत 55000 है🤣 😂 #घोरकलजुग pic.twitter.com/xaPFZzam8V
— अपूर्व اپوروا Apurva Bhardwaj (@grafidon) October 19, 2022
దీంతో అప్పటికే తిట్టి ఉద్యోగం నుంచి తీసేసిన ఎంప్లాయిని పాస్ వర్ట్ చెప్పమని యజమాని కోరాడు. కానీ అతను పాస్ వర్ట్ చెప్పేందుకు నిరాకరించడంతో చేసేదేమీ లేక...కొత్త సీపీయూ (CPU) కొన్నాడు. అయితే బస్సు నేమ్ బోర్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. జాబ్ నుంచి తీసేసినందుకు భలే పగ తీర్చుకున్నాడంటూ కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఇన్నాళ్లూ పని చేసిన యజమానిని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇండోర్‌లో ఈ బస్సు సర్వీస్‌కు మాత్రం ఫుల్ పబ్లిసిటీ వచ్చింది.