Ghaziabad, July 22: ఎక్స్‌ప్రెస్ హైవేపై స్కూటర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌పై ప్రయాణించిన తల్లీకొడుకు గాల్లోకి ఎగిరిపడ్డారు. (Mother-son flung into air) తీవ్రంగా గాయపడిన వారిద్దరూ మరణించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో (Ghaziabad) ఈ సంఘటన జరిగింది.
उत्तर प्रदेश : दिल्ली-मेरठ एक्सप्रेस-वे पर गाजियाबाद जिले में रॉन्ग साइड दौड़ रही कार ने स्कूटी सवार मां-बेटे को टक्कर मारकर मौत की नींद सुला दिया। मां–बेटा हरिद्वार से गंगा स्नान करके दिल्ली लौट रहे थे। pic.twitter.com/uAifxN88GO
— Sachin Gupta (@SachinGuptaUP) July 22, 2024
జూలై 20న రాత్రి 7.30 గంటల సమయంలో ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై తల్లీ, కుమారుడు స్కూటర్‌పై వెళ్తున్నారు. అయితే రాంగ్ రూట్‌టో వేగంగా వచ్చిన కారు వారి స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన తల్లీకొడుకును సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా, మృతులను ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల యష్ గౌతమ్, 40 ఏళ్ల తల్లి మంజు దేవిగా పోలీసులు గుర్తించారు. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని గంగా నదిలో స్నానం చేసి ఢిల్లీకి తిరిగి వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.