New Year's Eve 2020 (Photo Credits: File Image)

New Year's Eve 2020, December 31:  ఏడాది చివరి అంకానికి వచ్చేశాం. 2020కి ఇక కాలం చెల్లిపోనుంది. ప్రపంచంలోని అన్ని వర్ణాల వారిని, అన్ని రంగాల వారిని ఈ సంవత్సరం అనేక విధాలుగా పరీక్షించింది. ,మంచో, చెడో ఏది ఏమైనా ఈ ఏడాదికి ఇక వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది, 2021 సంవత్సరానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

ఈరోజు డిసెంబర్ 31, ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సరాన్ని స్వాగతం పలికేందుకు వేడుకగా జరుపుకునే ఏడాది యొక్క చివరి రోజు. ఇప్పటికే ఇయర్ ఎండ్ సెలబ్రేషన్ జోష్ అంతటా నిండుకుంది. ఈ సంవత్సరం న్యూ ఇయర్ ఈవినింగ్ పార్టీలు అంత గొప్పగా ఉండకపోయినా, పగలు-రాత్రి ప్రజలకు చుక్కలు చూపిన 2020 సంవత్సరానికి వీడ్కోలు చెప్పేందుకు వేడుక మరీ అంత చప్పగా మాత్రం ఉండకూడదు అని జనం డిసైడ్ అవుతున్నారు. న్యూ ఇయర్ ఈవినింగ్ కోసం మరింత కిక్! అర్ధరాత్రి వరకు బార్లు, వైన్ షాపులు ఓపెన్ 

ఇక కొన్ని ప్రముఖమైన సందర్భాలలో తన డూడుల్ ద్వారా సందేశాన్ని తెలిపే గూగుల్, ఈరోజు డిసెంబర్ 31న న్యూ ఇయర్ ఇవినింగ్ వేడుకల కోసం మమ్మల్ని పార్టీ మూడ్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. గూగుల్ ఇప్పటికే తన అందమైన డూడుల్‌తో వేడుకను ప్రారంభించింది. తన డూడుల్‌లో ‘గూగుల్’ అనే పదాన్ని రంగురంగుల లైట్లతో అలంకరించి మధ్యలో పాత తరహా బర్డ్‌హౌస్ అనలాగ్ 2020 గడియారాన్ని అమర్చింది. ఆ గడియారం గడియారం టిక్ టిక్ మంటూ 2021 కౌంట్డౌన్ మొదలైనట్లు సూచిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ స్క్రీన్ మీదుగా పూల వర్షం కురిసి న్యూ ఇయర్ ఈవినింగ్ పేజీని చూపిస్తుంది. ఈ డూడుల్ అర్ధరాత్రి 12 గంటలు అయిన తర్వాత అందులోని గడియారం విచ్చుకొని దానిలోంచి ఓ పక్షి వచ్చి న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతుంది. అద్భుతంగా ఉంది కదా!

సరే, మీరు కూడా ఇయర్ ఎండ్ సెలబ్రేషన్‌కు సిద్ధం కండి! 'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున మీ అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ న్యూ ఇయర్ ఈవినింగ్ గ్రీటింగ్స్.