Marriage (Credits: Google)

Newdelhi, Feb 12: మృత్యువు ఏ రూపంలో వస్తుందో మనం అంచనా వేయలేం.. అప్పటివరకు ఆనందోత్సాహంతో మన మధ్య ఉన్నవారే.. అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతుంటారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న వివాహంలో (Marriage) విషాదం చోటుచేసుకుంది. వధువు (Bride)  చేతిలో చెయ్యేసి ఏడడుగులు నడుస్తుండగా గుండెపోటుతో (Heart Attack) వరుడు (Groom) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) నంద్‌పూర్ కఠ్గరియాలో జరిగిందీ ఘటన.

వైద్య సిబ్బందికి ప్రభుత్వం డ్రెస్ కోడ్.. టీషర్టులు, జీన్స్, స్కర్ట్స్‌ ధరించొద్దని ఆదేశం.. ఎక్కడంటే??

సమీర్ ఉపాధ్యాయ (30) అనే దంత వైద్యుడి వివాహం శుక్రవారం జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వరుడిని ఊరేగింపుగా పెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం వివాహ తంతు మొదలైంది. వధువుతో కలిసి ఏడడగులు వేస్తున్న సమయంలో సమీర్ అకస్మాత్తుగా  కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కార్డియాక్‌ అరెస్టుతో సమీర్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ఎల్లుండి కొండగట్టుకు కేసీఆర్.. మాస్టర్ ప్లాన్ పై అధికారులతో చర్చ.. నేడు కొండగట్టుకు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి

వరుడు ప్రదక్షిణలు చేస్తున్న క్రమంలో కుప్పకూలాడని బంధవులు తెలిపారు. పెళ్లి సమయంలో జరిగిన ఈ సంఘటన విని అందరూ షాక్ అవుతున్నారు. మొదట వరుడిని కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో పెద్దాసుపత్రికి తరలిస్తుండగా వరుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

రైలు ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి మార్చి 1 వరకు పలు రైళ్ల రద్దు.. ఏ సర్వీసు రద్దు అయిందో జాబితా ఇదిగో..