Bengaluru, May 14: ఇటీవల వచ్చిన ఓ సినిమాలో హీరో దెయ్యాన్ని (Ghost) వివాహం (Marriage) చేసుకోవడం చూసి ఆశ్చర్యం వేసింది కదూ.. కర్ణాటకలోని పుత్తూరులో ఓ కుటుంబ పెద్దలు ఇచ్చిన పత్రికా ప్రకటన దానికి మించేలా ఉంది. 30 ఏండ్ల క్రితం మరణించిన తమ కుమార్తెకు తగిన ప్రేతాత్మ వరుడు కావాలని ఈ ప్రకటనలో మరణించిన ఆమె తల్లిదండ్రులు కోరారు. “కులల్ కులం, బంగే రా గోత్రంలో జన్మించిన వధువుకు తగిన వరుడు కావలెను. వధువు 30 ఏండ్ల క్రితం మరణించింది” అని ఈ ప్రకటనలో వాళ్లు తెలిపారు. ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు.
30 Years After Daughter's Death, Family Places Matrimonial Ad For 'Ghost' Groom https://t.co/WrvsUzIN9h #new #updates #trending
— Indiatimes (@indiatimes) May 13, 2024
టోల్ గేట్ వద్ద డబ్బులు అడిగినందుకు.. కారుతో మహిళను ఢీ కొట్టాడు.. యూపీలో ఘోరం (వైరల్)
ఆ ప్రకటన వెనుక ఉన్నదేంటంటే?
దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని తులునాడు ప్రాంతంలో మరణించినవారి ఆత్మలకు వివాహం చేసే ఆచారం ఉంది. జీవించి ఉన్నవారికి పెండ్లి చేసినట్లుగానే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే సదరు ప్రకటన వెలువడినట్లు తెలుస్తుంది.