Shooting: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కారులో కూర్చుని బర్గర్ తింటుంటే.. పోలీసు వచ్చి కాల్చేశాడు.. పొరపాటు పడి కాల్చి.. ఆ యువకుడే దాడికి దిగాడంటూ సమర్థించుకోబోయిన పోలీసు.. అతడి బాడీ కెమెరాలో నిక్షిప్తమైన వీడియోలో బయటపడిన వాస్తవాలు
Shooting (Photo Credits: Twitter)

Newyork, October 9: అది అమెరికాలోని (America) శాన్ డియాగోలో ఉన్న ఓ మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ (Restaurant). ఎరిక్ కంటూ అనే 17 ఏళ్ల యువకుడు అందులోంచి బర్గర్లను (Burger) తీసుకున్నాడు. పార్కింగ్ లాట్ (Parking Lot) లో ఉన్న తన కారులో కూర్చుని తింటున్నాడు. ఇంతలో జేమ్స్ బ్రెనాండ్ అనే పోలీసు అధికారి (Police Officer) అక్కడికి వచ్చాడు. కారు డోర్ తీసి కిందికి యువకుడిని దిగాలన్నాడు. ఎందుకు అని అడిగితే రివాల్వర్ తీసి గురిపెట్టాడు.

ఏందయ్యా ఇది.. ఇలాంటి ఘన స్వాగతాన్ని నేనెప్పుడూ చూడలే.. షోరూము నుంచి ఇంట్లోకి వస్తూనే అదుపు తప్పిన కొత్త కారు.. బైకులు ధ్వంసం

అది చూసి భయపడిన యువకుడు.. కారును పక్కకు తీయడానికి ప్రయత్నించాడు. అంతే సదరు పోలీసు రివాల్వర్ తో కాల్చడం మొదలుపెట్టాడు. కారులో కొంత దూరం పారిపోయిన యువకుడికి పలుచోట్ల బుల్లెట్ గాయాలు అయి ఆగిపోయాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. సదరు యువకుడు తనపై దాడికి ప్రయత్నించాడని జేమ్స్ బ్రెనాండ్ చెప్పడంతో.. యువకుడిపైనే కేసు పెట్టారు. తర్వాత సదరు పోలీసు డ్రెస్ కు అమర్చి ఉన్న బాడీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను ఉన్నతాధికారులు పరిశీలించగా వాస్తవాలు బయటపడ్డాయి.