Corona Cases Update: దేశంలో కరోనా కలకలం.. 24 గంటల్లో 10,753 కొత్త కేసులు.. 27 మరణాలు
దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) కలకలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10 వేలకు పైనే కొత్త కేసులు బయటపడ్డాయి.
Newdelhi, April 15: దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) కలకలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10 వేలకు పైనే కొత్త కేసులు బయటపడ్డాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 1,58,625 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 10,753 కేసులు బయటపడ్డాయి.
మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల (Active CAses) సంఖ్య 53,720కి చేరింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4,43,22,211 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,091కి చేరింది.
(The above story first appeared on LatestLY on Apr 15, 2023 10:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

