Puri's Jagannath Temple (Credits: X)

Puri, July 16: పూరీ జగన్నాథ్ ఆలయంలోని (Puri Temple) రత్న భండార్‌ (Ratna Bhandar)ను రెండు రోజుల క్రితం తెరిచిన విషయం తెలిసిందే. అయితే ఆ రత్న భండార్ లోని లోపలి గదిని డూప్లికేట్ కీస్‌ తో ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ తాళం చెవిలతో ఆ లోపలి  ఛాంబర్ తెరుచుకోలేదు. అయితే, డూప్లికేట్ కీస్‌ తో ఎందుకు ఆ గది తెరుచుకోలేదో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టనున్నట్లు ఒడిశా సర్కార్ తెలిపింది. 12వ శతాబ్ధానికి చెందిన జగన్నాథ ఆలయం రత్న భండార్‌ ను 46 ఏళ్ల తర్వాత ఆదివారం తెరిచారు. దాంట్లో ఉన్న విలువైన బంగారు, వెండి ఆభరణాలను లెక్కించేందుకు ఆ రత్న భండార్‌ ను తెరిచారు.

జేఎన్టీయూహెచ్ కిచెన్ లో ఈసారి పిల్లి.. ఎలుకను వెతుక్కుంటూ వచ్చిందంటూ బీఆర్ఎస్ నేతల ట్వీట్ (వీడియోతో) 

బద్దలు కొట్టి..

లోపలి గదిలో ఉన్న మూడు తాళాలను ఓపెన్ చేసేందుకు ప్రత్యేక కమిటీ ప్రయత్నించింది. అయితే పూరి జిల్లా అధికారి అరవింద పదే వద్ద ఉన్న రెండు డూప్లికేట్ తాళంచెవిలతో ఆ ట్రెజరీ తాళాలు ఓపెన్ కాలేదు. దీంతో ఆ తలుపులను బద్దలుకొట్టారు. నిధిని బయటకు తీశారు. ఈ క్రమంలోనే విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

జమ్మూకశ్మీర్ లో భారీ ఎన్ ‎కౌంటర్.. అధికారి సహా అమరులైన నలుగురు సైనికులు