Bhopal, April 7: ముఖానికి ఉన్న మాస్క్ సరిగా లేదన్న నెపంతో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై పోలీసులు చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 35 ఏండ్ల వయసున్న ఓ వ్యక్తి హాస్పిటల్లో ఉన్న తన తండ్రి కోసం భోజనం తీసుకెళ్తున్నాడు. అయితే అతను సరిగా మాస్కు ధరించలేదని పోలీసులు ఆపారు. ఆ తర్వాత అతన్ని రోడ్డుపై పడేసి తీవ్రంగా (Indore Cops Beating A Man) కొట్టారు. తలపై కాలు పెట్టి తొక్కారు. ఆ వ్యక్తి బంధువులు ఎంత వేడుకున్నప్పటికీ పోలీసులు కనికరించలేదు. అతని చిన్న వయసు గల కొడుకు (His Minor Son) మా నాన్నని కొట్టొద్దు సర్ అంటూ వేడుకున్నా పోలీసులు కనికరించలేదు.
కాగా పోలీసుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నించగా వారు ఇంకా రెచ్చిపోయారు. ఆటోడ్రైవర్‌పై తమ ప్రతాపం చూపించారు. అతనితో వచ్చిన కొడుకు కూడా సాయం చేయాలని అక్కడి వాళ్లను కోరినా.. చోద్యం చూస్తున్నట్లు ఉండిపోయారేగానీ ఎవరూ ముందుకు రాలేదు. ఈ తతంగాన్నంతా ఓ వ్యక్తి తన మొబైల్‌లో వీడియో తీశాడు.
Here's Video
Pls check @PoliceIndore reaction on this.@MPDial100 pic.twitter.com/HfdCzZQqaE
— Raajeev Chopra (@Raajeev_romi) April 6, 2021
దాడి చేసిన పోలీసులను కమల్ ప్రజాపథ్, ధర్మేంద్ర జట్‌గా గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వారిద్దరిని సస్పెండ్ (Police Issues Statement) చేశారు. కాగా కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. గత 24 గంటల్లో 3,722 కొత్త కేసులు, 18 మరణాలు సంభవించాయి. మార్చి నుంచి, ఇప్పటి వరకు మాస్క్ ధరించని 1,61,000 మందికి జరిమానా విధించారు. వారి నుంచి మొత్తం 1.85 కోట్లు వసూలయ్యాయి.
భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. బహిరంగ ప్రదేశాలలో ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి చేశాయి. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ప్రదేశాల్లో రాత్రి కర్ఫ్యూ విధించాయి. ఇక కరోనా నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా బయటికి వచ్చిన వారిపై జరిమానా కూడా విధిస్తున్నారు.