Newdelhi, Sep 12: భూ ప్రకంపనలతో అండమాన్ (Andaman) దీవులు, మణిపూర్‌లోని (Manipur) ఉక్రుల్ ప్రాంతం వణికిపోయాయి. మంగళవారం వేకుమజామున 3.39 గంటలకు అండమాన్ సముద్ర తీరంలో (Andaman Sea) భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 93 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. సోమవారం వేకువజామున 4.4 తీవ్రతతో బంగాళాఖాతం (Bay of Bengal) తీరంలో భూమి కంపించిందని పేర్కొంది.
An earthquake of magnitude 4.4 hit Andaman Sea at 03:39 am today: National Center for Seismology pic.twitter.com/llvZlrQ057
— ANI (@ANI) September 11, 2023
మణిపూర్‌లోనూ..
ఇక సోమవారం రాత్రి 11.1 గంటలకు మణిపూర్‌లోని ఉఖ్రుల్ (Ukhrul) జిల్లాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.1గా నమోదయిందని ఎన్‌సీఎస్ వెల్లడించింది. రాత్రివేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.