సోషల్ మీడియాలో ఏది నిజమో..ఏది అబద్దమో తెలియడం లేదు. అయితే అది మాత్రం వైరల్ అవుతోంది. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీరా దాన్ని ఎంక్వయిరీ చేస్తే అది ఫేక్ అని తేలింది. వైరల్ అవుతున్న వీడియోని పరిశీలిస్తే.. తెలంగాణలో ఆసిఫాబాద్ జిల్లా (asifabad) వ్యాప్తంగా సోషల్ మీడియాలో (Social Media) ఓ ఫేక్ వీడియో చక్కర్లు కొడుతూ జిల్లావాసులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది.
ఓ బాలుడి ప్రాణాలు కాపాడిన తండ్రి (man-crossing-rivulet-and-carrying-toddler-asifabad) ఫోటోలు వాట్సాప్ , ఫేస్ బుక్ ల్లో మూడు రోజుల నుంచి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అది నిజమే అనుకుని నెటిజన్లు విఫరీతంగా ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే అదంతా ఫేక్ అని తేలింది.
ఫేక్ వార్త ఏంటంటే.. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం చింతకర్రకు చెందిన ఓ పసికందు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా, వైద్యం కోసం వాగు దాటిస్తున్నట్లుగా ఓ ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోలో ఓ పసికందును గొంతు వరకు వచ్చిన నీళ్లలో ఓ తండ్రి నదిని దాటిస్తున్నట్లుగా ఉంది. బాహుబలి స్టంట్ అంటూ వార్తలు సైతం ప్రసారమవుతున్నాయి. అయితే ఈ వార్త ఇప్పటిది కాదని 2016 ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణం మన్యం ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన అని తేలింది.
Here's Fake News goes viral in Social Media
Bahubali in real life....Lack of ambulance in remote village of Asifabad made this great father🙏cross a heavy stream carrying his ailing kid to hospital ...#healthemergency #floods pic.twitter.com/JwVAvGs651
— Kranthiquotes (@kranthimirinda) September 27, 2020
నాలుగేళ్ల క్రితం అంటే 2016లో విశాఖ జిల్లా మన్యంకు చెందిన పాంగి సత్తిబాబు అనే వ్యక్తి తన చిన్నారికి తీవ్రవజ్వరం రావడంతో చింతపల్లి మండలం కుడుముసారె గ్రామం నుంచి లోతుగెడ్డ ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల కోసం తీసుకెళ్లాడు. అప్పట్లో ఈ వార్త సంచలనం రేపింది. ఈ ఫోటోలు ఇప్పటివి కావని ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఘటన అంతకంటే కాదని తేలింది.
Here's Original News
విశాఖ జిల్లాలోనే ..పాంగి సత్తిబాబు తన చిన్నారికి జ్వరం వచ్చిందని చింతపల్లి మండలం కుడుముసారె గ్రామం నుంచి లోతుగెడ్డ pic.twitter.com/UjZ8h3buSB
— Commissioner Tribal Welfare (@TribalWelfareAP) September 28, 2016
దీంతో ఇది ఫేక్ న్యూస్ అని, కావాలనే కొందరు ఆకతాయిలు ఈ వార్తను తాజాగా సోషల్ మీడియా వైరల్ చేసినట్టు సమాచారం. చింతకర్రకు వాగు కష్టాలు ఉన్నా గత వారం రోజులుగా ఇలాంటి పరిస్థితి ఏమీ లేదని గ్రామస్తులు, అధికారులు పేర్కొన్నారు. దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఎస్సై తిరుపతి తెలిపారు.