Rs 7 Crore Bill Uber Bill: కేవ‌లం 6 కిలోమీట‌ర్ల దూరానికి ఏకంగా రూ. 7.6 కోట్లు బిల్లు వేసిన ఉబెర్, సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారిన పోస్ట్
Uber (PIC@ Twitter)

Noida, March 31: క్యాబ్, ఆటో ఎక్కితే బిల్లు ఎంత అవుతుంది? ప్రయాణ దూరాన్ని బట్టి రూ.50, రూ.100 లేదంటే కొన్ని వేల రూపాయలు అవుతుంది. అంతేగానీ, లక్షలు, కోట్ల రూపాయల్లో అవుతుందా? తాజాగా, ఉబెర్ క్యాబ్ (Uber Cab) ఎక్కిన ప్రయాణికుడు తనకు రూ.7.66 కోట్ల బిల్లు వచ్చిందని తెలుసుకుని ఉలిక్కిపడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలను, బిల్లుకు సంబంధించిన ఫొటోను అతడు ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. నోయిడాలో ఉబెర్ క్యాబ్ ఎక్కిన వినియోగదారుడికి ఈ అనుభవం ఎదురైంది. దీపక్ టెంగూరియా అనే వ్యక్తి ఉబర్ క్యాబ్ ఎక్కాడు. అతడు ప్రయాణించిన దూరానికి కేవలం రూ.62 మాత్రమే అవుతుంది.

 

దీపక్ తన లొకేషన్‌ చేరుకుంటుండగా తన యాప్‌లో చూసుకున్నాడు. అందులో రూ.7.66 కోట్ల బిల్లు వేయడంతో (Rs 7 Crore Bill) షాక్ అయ్యాడు. ఇంత బిల్లు రావడం ఏంటని డ్రైవర్ ను అడిగాడు. తనకు మొత్తం రూ.7,66,83,762 బిల్లు వచ్చిందని చెప్పాడు. అందులో టిప్ చార్జి కోటిన్నరకుపైగా, వెయిటింగ్ చార్జి దాదాపు రూ.6 కోట్లుగా ఉంది. దీనిపై స్పందించిన ఉబర్ సంస్థ బిల్లు అలా ఎలా వచ్చిందో, సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో చూస్తామని తెలిపింది.