Crackers (Credits: Google (Representational))

Mumbai, October 25: గ్లాసు బాటిల్‌లో (Glass Bottle) బాంబులు (Crackers) కాల్చడం వల్ల వాటి ముక్కలు అందరికీ గుచ్చుకునే ప్రమాదం ఉందని, కాబట్టి వాటిని కాల్చొద్దన్న యువకుడిని ముగ్గురు బాలురు కత్తితో పొడిచి చంపారు. ముంబైలో (Mumbai) జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని శివాజీ నగర్‌కు చెందిన 12 ఏళ్ల బాలుడు గ్లాసు బాటిల్‌లో టపాసులు (Crackers) ఉంచి పేలుస్తున్నాడు. గమనించిన పొరిగింటి యువకుడు సునీల్ శంకర్ నాయుడు (21) వద్దని వారించాడు. అది చాలా ప్రమాదమని, గ్లాసు పేలి దాని ముక్కలు అందరికీ గుచ్చుకుంటాయని, కాబట్టి వద్దని వారించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

ఏ రాశుల వారికి సూర్యగ్రహణం అశుభం, ఏ రాశుల వారు సూర్యగ్రహణం వేళ జాగ్రత్తగా ఉండాలి, గ్రహణం ప్రభావం పడకుండా ఏ దేవుడిని పూజించాలి...

గొడవను చూసిన బాలుడి అన్న (15), అతడి స్నేహితుడు (14) అక్కడికొచ్చారు. ముగ్గురూ కలిసి శంకర్‌తో గొడవకు దిగారు. అనంతరం ఆగ్రహంతో అతడిపై దాడిచేశారు. బాలుడి అన్న కత్తితో శంకర్ పొట్టలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన శంకర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి అన్న, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. ఘటనకు కారణమైన బాలుడు పరారీలో ఉన్నాడు.