Pakistani Bride Weighed in Gold: కూతురి పెళ్లిలో బంగారు ఇటుకలతో తులాభారం, 69 కిలోల బంగారు ఇటుకలను అల్లుడికి కట్నంగా ఇచ్చిన పాకిస్థానీ బిజినెస్‌మ్యాన్, వైరల్‌గా మారిన పెళ్లి వీడియో
Pakistani Bride Weighed in Gold (Screen garb from viral video)

Dubai, March 04: శ్రీమంతుల ఇంట్లో పెళ్లి అంటే ఎటు చూసినా ఏది చూసినా దర్పమే కనిపిస్తుంది. వధూవరుల దుస్తులు,ఆభరణాలు,పెళ్లిలో పెట్టే భోజనాలు, వెడ్డింగ్ ఈవెంట్ ఇలా అంతా ఘనంగా ఉంటుంది. కూతురు పెళ్లి అంగరంగ వైభోగంగా జరిపించాలని ప్రతీ తండ్రీ అనుకుంటాడు. ఆకాశమంత పందిరి వేసి భూదేవంత పీట వేసి పెళ్లి జరిపించాలనుకుంటాడు. అది తండ్రికి కూతురిపై ఉన్న ప్రేమ అటువంటిది. ఆకాశమంత పందిరి. భూదేవంత పీట సాధ్యం కాదు. బంగారంలా పెంచుకున్న కూతుర్ని వజ్రంలాంటి అల్లుడి చేతిలో పెట్టాలనుకుంటాడు. కానీ ఓ తండ్రి మాత్రం కూతురుని బంగారంతో తులాభారం (bride weighed in gold) వేసి ఆమె ఎత్తు బంగారాన్ని వరుడికి కట్నంగా ఇచ్చాడు. అంతే ఈ తండ్రి కూతురికి ఇచ్చిన కట్నం గురించితెలిస్తే షాక్ అవ్వాల్సిందే. దుబాయ్ స్థిరపడిన ఓ పాకిస్థానీ (Pakistani bride) వ్యాపారవేత్త కుమార్తె శరీర బరువుకు సమానమైన బంగారపు ఇటుకలతో తూకం వేయించి ఆ బంగారాన్ని అల్లుడికి కట్నంగా ఇచ్చాడు. ఆమె బరువు 69 కేజీలు తూగింది. అలా బంగారపు ఇటుకలతో కూతున్ని తులాబారం వేయించి అంత ఎత్తు బంగారం అల్లుడికి కట్నంగా ఇచ్చాడా తండ్రి. అలా బంగారపు ఇటుకలతో (Gold bricks) కూతుర్ని తులాభారం వేయటం చూసినవారంతా వామ్మో..ఏంటీ దర్పం మరీ ఇంతా..అనుకుంటూ షాక్ అయ్యారు పెళ్లికి వచ్చినవారంతా..

 

 

View this post on Instagram

 

A post shared by Dulha.net (@dulhadotnet)

కూతురు 69 కిలోల బరువుంది. మరో 30 కిలోలు బరువున్నా అలాగే ఇచ్చేవాడేమో అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి మరోసారి షాక్ అయ్యారు. ఈ మొత్తం ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..ఈ బంగారమంతా నకిలీదని పెళ్లి మొత్తం ఓ థీమ్‏తో జరిగిందని ఆ ఇటుకలు అన్నీ బంగారం రంగు రాతి ఇటుకలు అని వెడ్డింగ్ ప్లానర్స్ తెలిపారు.

Viral Video: ఈ గ్రహం మీద అందమైన ఇల్లు, విలాసవంతమైన కార్లు, డబ్బుకు విలువ లేదు, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో.. 

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మూవీ జోధా అక్బర్ థీమ్ తో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. అయితే వివాహ సెటప్ వివాదాస్పదమైనప్పటికీ, వెడ్డింగ్ ప్లానర్లు చాలా కష్టపడి జోధా అక్బర్ కాన్సెప్ట్‌ను రీక్రియేట్ చేశారంటున్నారు నెటిజన్లు..