Corona Beer vs Coronovirus | Photo: Wikimedia Commons.

చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనావైరస్ (Coronovirus) విజృంభిస్తున్న వేళ, ఒక బీర్ కంపెనీకి పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ బీర్ తాగేందుకు ప్రజలు జంకుతున్నారు. దాని దెబ్బతో అసలు ఏ బీరు వద్దు, ఫ్రీగా పార్టీకి పిలిచినా బీర్లు వద్దంటూ వెనకడుగు వేస్తున్నారు. అందుకు కారణం ఆ బీర్ పేరులో 'కరోనా' ఉండటమే.  ప్రజలు కరోనా వైరస్ మరియు కరోనా బీర్ పట్ల కన్ఫ్యూజ్ అవుతున్నట్లు గూగుల్ ట్రెండ్స్ రిపోర్టులు చెబుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా బీర్ ప్రియులు ఈనెల జనవరి 18 నుంచి ఇంటర్నెట్లో "corona beer virus," "beer virus," మరియు "beer coronavirus" అనే కీవర్డ్స్ ఉపయోగించి తెగ సెర్చింగ్ చేసేస్తున్నట్లు వెల్లడైంది. కరోనా బీర్, కరోనా వైరస్ ఒక్కటేనా?  కరోనా బీర్ తాగడం ద్వారా వైరస్ సోకుతుందా?  కరోనా వైరస్ తాగితే చచ్చిపోతారా? అనే సందేహాలు గూగుల్‌లో వ్యక్తం చేస్తున్నారట. ఇంటర్నెట్లో కరోనా బీర్‌కు మరియు కరోనా వైరస్‌కు మధ్య  (Corona Beer vs Coronovirus) ఒక యుద్ధమే జరుగుతుంది.

జనవరి 18 నుండి జనవరి 26 వరకు ప్రపంచవ్యాప్తంగా "కరోనా బీర్ వైరస్" కోసం శోధనలు 2,300% పెరిగాయి. "బీర్ వైరస్" కోసం శోధనలు 744% పెరిగాయి, మరియు "బీర్ కరోనావైరస్" కోసం శోధనలు 3,233% పెరిగాయని గూగుల్ ట్రెండ్స్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.   భారత్‌లో తొలి కరోనావైరస్ కేసు నమోదు

 

A funny post over Corona Beer rocketing around social media | Photo: Vinod Kumar

ఈ దెబ్బకు కరోనా బీర్ సంస్థ 'కరోనా ఎక్స్‌ట్రా' (Corona Extra) తమ బీర్‌కు, ఆ వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదు. దానికి దీనికి ముడిపెట్టవద్దని వివరణ ఇచ్చుకుంది. "మా కరోనా బీర్ సేవించే వినియోగదారులు ఎంతో మంచి వారు, తెలివైన వారు. వారికి మా బీర్ పట్ల వారికి సంపూర్ణ విశ్వాసం ఉంది. కరోనా బీర్‌కు మరియు కరోనా వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదని మా వినియోగదారులు నమ్ముతున్నారు. ఈ కన్ఫ్యూజన్ వల్ల మా వ్యాపారానికి ఎలాంటి నష్టం జరగదు". అని కరోనా ప్రొడక్ట్స్ కాన్‌స్టెలేషన్ బ్రాండ్స్ సీనియర్ కమ్యూనికేషన్ డైరెక్టర్ మ్యాగీ బౌమన్ పేర్కొన్నారు.  హాంగోవర్ నుంచి బయట పడేందుకు చిట్కాలు

కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం (Crown) అని అర్ధం, స్పానిష్ భాషలో కూడా ఇదే అర్థాన్ని సూచిస్తుంది. ఆంగ్లంలో కరోనా అంటే కిరీట భాగం కలిగిన అని అర్థం వస్తుంది. మైక్రోస్కోప్‌లో ఆ చైనా వైరస్‌ను పరిశీలించి చూసినపుడు అది ఒక కిరీటం లాంటి ఆకృతిని కలిగి ఉంది. అందుకే దానికి "కరోనా" వైరస్ అని పేరు పెట్టారు. "కరోనా వైరస్" ప్రాణాలు తీసేది.. చైనాలో పుట్టింది.  కానీ "కరోనా బీర్" ప్రాణాలను ఆహ్లాదపరిచేది.. మెక్సికోలో పుట్టింది.  కాబట్టి మా బీర్‌ను ఎప్పట్లాగే సంతోషంగా, ప్రశాంతంగా, హాయిగా తాగుతూ ఆస్వాదించండి అంటూ ఆ బీర్ కంపెనీ నెత్తి బాదుకుంటోంది.