Trissur, May 19: ఓ పెద్దాయన టీ దుకాణంలో కూర్చుని టీ తాగుతున్నాడు. ఆయన చొక్కా జేబులో ఉన్న ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయింది (Phone Exploded). చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో 76 ఏళ్ల ఇలియాస్ అనే వ్యక్తి మారొట్టిచల్ పరిసరాల్లోని టీ దుకాణంలో టీ తాగుతున్నాడు. అతని జేబులో ఉన్న ఫోన్ సడెన్‌గా పేలిపోయి మంటలు రావడం (Mobile blast) మొదలుపెట్టింది. అప్రమత్తమైన అతను వెంటనే ఫోన్ తీసి కింద పడేశాడు. దాంతో అతను ప్రమాదం నుంచి సేఫ్‌గా బయటపడ్డాడు.
కేరళలో ఓ వ్యక్తి జేబులో పేలిన సెల్ ఫోన్.#Kerala #MobilePhoneBlast #KeralaPhoneBlast pic.twitter.com/fhNm2D930r
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2023
ఇక ఈ ఘటనపై పోలీసులు ఇలియాస్‌ను పిలిచి వివరం అడిగారు. ఏడాది క్రితం కొన్న ఫోన్ అని ఇప్పటివరకూ ఎటువంటి ఇబ్బందులు లేవని ఇలియాస్ పోలీసులకు చెప్పాడు. తాజాగా కోజికోడ్‌లో కూడా ఇటువంటిదే సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ పేలడంతో ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. త్రిసూర్‍లో కూడా ఎనిమిదేళ్ల బాలిక చేతిలో ఉన్న మొబైల్ పేలి మరణించింది. వరుసగా ఫోన్ పేలుడు సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.