Viral Water Fall

Newdelhi, July 15: కొండ కోనలు, లోయలు, జలపాతాలు ఉన్న టూరిస్టు ప్రదేశాలలో (Tourist Places) ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్చరికలను చాలామంది పర్యాటకులు పట్టించుకోరు. అలా చేసే ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటారు. కర్ణాటక (Karnataka) ముడిగేరిలోని చార్‌ మడి జలపాతం వద్ద కూడా ఇలాగే నిషేధాజ్ఞలు పక్కనబెట్టి స్నానం చేస్తున్న కొందరు పర్యాటకులకు పోలీసులు విధించిన చిన్నపాటి శిక్షను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

పంజాగుట్ట పీవీఆర్ సినిమా థియేటర్లో జలపాతం.. కంగుతిన్న వీక్షకులు.. ‘కల్కి’ సినిమా షో నిలిపివేత.. వైరల్ వీడియో

అసలేం జరిగిందంటే?

చార్‌ మడి జలపాతం జలపాతంలో స్నానం చేయడాన్ని ప్రభుత్వం నిషేధించినా కొందరు స్నానాలు చేయడంతో వారు జలపాతం దిగువన ఉంచిన దుస్తులను పోలీసులు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో పర్యాటకులు తమ బట్టలు ఇచ్చేయాలంటూ అర్ధనగ్నంగా పోలీసులను వేడుకుంటున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. దీంతో పర్యాటకులను హెచ్చరించిన అనంతరం పోలీసులు వారి బట్టలు ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.