Chandigarh university (Photo Credits: Twitter)

Chandigarh, September 18:  పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్శిటీలో (Chandigarh University) దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయి తన హాస్టల్ (Hostel) లో ఉన్న 60 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలను (Private Videos) సీక్రెట్ గా తీసి తన బోయ్ ఫ్రెండ్ (Boy Friend) కు పంపించింది. అతను ఆ వీడియోలను ఆన్ లైన్ లో (Online) లీక్ (Leak) చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. ఈ ఘటనతో హాస్టల్ లోని అమ్మాయిలు షాక్ కు గురయ్యారు. పది మంది విద్యార్థినులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. యూనివర్శిటీలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు సైతం ఆందోళనకు దిగారు. క్యాంపస్ కు వచ్చిన పోలీసుల వాహనాన్ని విద్యార్థినులు తగులబెట్టారు. మరోవైపు వీడియోలను తీసి, పంపించిన విద్యార్థినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.