Representational Image | (Photo Credits: PTI)

రోజు రోజుకు మానవతా విలువలు మంట గలుస్తున్నాయి. క్షణిక సుఖం కోసం రక్త సంబంధాలను సైతం తెగతెంపులు చేసుకుంటున్నారు. చిన్నతనం నుంచి అల్లారుముద్దుగా పెంచిన మేనమామ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మేనల్లుడు ఆమెతో కలిసి ఇంట్లోంచి పరారయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చోటుచేసుకుంది. నిందితుడి మామ, అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ నడుస్తోంది. వివరాల ప్రకారం, భరత్‌పూర్‌లోని మధురగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్‌పూర్ కాలనీలో నివసిస్తున్న ఓ వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరి మధ్య అంతా సవ్యంగా సాగుతుండగా 19 ఏళ్ల భార్య ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు రావడంతో భర్తకు అనుమానం వచ్చింది. వాస్తవానికి, ఆ వ్యక్తి భార్య తన 17 ఏళ్ల మేనల్లుడితో వివాహేతర సంబంధాన్ని ప్రారంభించింది. వారిద్దరూ గత వారం ఇంటి నుండి తప్పించుకొని పారిపోయారు. బాధితుడి భార్య పరారీలో ఉందని, ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తన భార్య మేనల్లుడితో కలిసి పరారీలో ఉందని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని, దీనిపై కుటుంబ సభ్యులు కూడా సర్దిచెప్పే ప్రయత్నం చేశారని, అయితే అవకాశం రావడంతో ఓ రోజు ఇద్దరూ తప్పించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా మైనర్ బాలుడితో యువతి పరారవ్వడంతో, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.

అదే సమయంలో కోడలిపై ఆమె అత్త కూడా ఫిర్యాదు చేసింది. తన మనవడితో కోడలు అదృశ్యం చేసిందని. కోడలిపై చర్యలు తీసుకోవాలని, మనవడిని కనిపెట్టాలని పోలీసులను కోరారు. పోలీసులు ఇద్దరి కోసం వెతుకులాట ప్రారంభించారని, త్వరలో వారి జాడ కనుగొంటామని పేర్కొన్నారు.