Jio New Recharge Plan: జియో నుంచి దిమ్మతిరిగే ప్లాన్, అపరిమిత 5జీ డేటాతో పాటు జియో యాప్ సర్వీసులు ఫ్రీ, రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకోండి
కస్టమర్లను ఆకర్షించేందుకు దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. తాజాగా ఎక్కువ డేటా వాడే వినియోగదారుల కోసం జియో అందిస్తున్న ఓ ఆఫర్ ఆకట్టుకుంటోంది. కొత్తగా రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ఇటీవలే రిలయన్స్ జియో ప్రకటించింది. 14 రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ఆఫర్ కింద అర్హులైన కస్టమర్లు అపరిమిత 5జీ డేటాను పొందొచ్చు.
కస్టమర్లను ఆకర్షించేందుకు దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. తాజాగా ఎక్కువ డేటా వాడే వినియోగదారుల కోసం జియో అందిస్తున్న ఓ ఆఫర్ ఆకట్టుకుంటోంది. కొత్తగా రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ఇటీవలే రిలయన్స్ జియో ప్రకటించింది. 14 రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ఆఫర్ కింద అర్హులైన కస్టమర్లు అపరిమిత 5జీ డేటాను పొందొచ్చు. ఆగని లేఆప్స్, 6 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయిన సిస్కో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు అడుగులు
జియో అందిస్తున్న చౌకైన ఆఫర్లలో ఈ ప్లాన్ ఒకటిగా ఉంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు రోజుకు 2 జీబీ 4జీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో జియో యాప్ సర్వీసులు కూడా పొందవచ్చు. జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా యాప్ సేవలు లభిస్తాయి. కాగా రూ.198 రీఛార్జ్ ప్లాన్‌తో సమానమైన సేవలను 28 రోజులపాటు పొందాలనుకుంటే రూ.349 ప్లాన్‌ను రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. 14 రోజుల ప్లాన్‌ను నెలలో రెండు సార్లు రీచార్చ్ చేయించుకుంటే రూ.396 అవుతుంది. దానితో పోల్చితే రూ.349 ప్లాన్ ఉత్తమం.
(The above story first appeared on LatestLY on Aug 20, 2024 11:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

