
Hyderabad, September 5: నటి, దర్శకురాలు రేణు దేశాయ్ చేసిన తాజా పోస్ట్ ఆమె రెండోపెళ్లిపై మరోసారి చర్చకు దారితీసింది. 'జీవితంలో అవసరం ఉన్నప్పుడు మనచేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి'.. అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్టును షేర్‌చేసింది. అనంతరం మరో పోస్ట్ లో.. 'మీ సోల్‌మేట్‌ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి'.. అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.