Newdelhi, May 25: దేశంలో ఆర్థిక అసమానతలను (Financial Inequality) అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటిని తగ్గించడానికి ఫ్రాన్స్ కు (France) చెందిన వరల్డ్ ఇనిక్వాలిటీ ల్యాబ్ ఆర్థికవేత్తలు పలు కీలక సూచనలు చేశారు. దేశంలోని సంపన్నులపై ‘కరోడ్ పతి ట్యాక్స్’ విధించాలని సిఫారసు చేశారు. 2010 తర్వాత ఉన్నట్టుండి కోట్లకు పడగలెత్తిన కరోడ్‌పతిలు సంపాదించిన సొత్తుపై ముఖ్యంగా ఈ పన్ను విధించాలని పేర్కొన్నారు.
Researchers Propose 'Crorepati' Tax Justice Plan, Leaving 99.96% Population Untouched#Economyhttps://t.co/pUduZaZzSH
— The Wire (@thewire_in) May 24, 2024
ట్యాక్స్ విధింపు ఇలా..
‘కరోడ్ పతి ట్యాక్స్’ను సంపాదనను బట్టి విధించాలని నిపుణులు సూచించారు. రూ. 10 కోట్ల వరకూ సంపాదన ఉన్నవారికి 2%, రూ. 100 కోట్ల సంపాదన ఉన్నవారికి 4 శాతం, రూ. 100 కోట్లకు పైగా సంపాదన ఉన్నవారికి మరింత ఎక్కువగా ట్యాక్స్ ఉండాలని ఓ పట్టికను విడుదల చేశారు. ఈ కొత్త ట్యాక్స్ నిబంధనల ప్రభావం దేశంలో సంపన్నులుగా ఉన్న 0.04 శాతం మందిపై మాత్రమే ఉంటుందని, మిగతా 99.96 శాతం మంది జనాభాపై ఏ ప్రభావం ఉండబోదని వెల్లడించారు.
క్రిప్టో ఐకాన్, మన సోషల్ మీడియా చింటూ డాగ్ కబొసు ఇక లేదు.. మరణించిన జపనీస్ శునకం