న్యూఢిల్లీ, మార్చి 16: తన భార్యకు అంగం ఉందని వెంటనే విడాకులు ఇప్పించాలంటూ ఓ భర్త సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. ఈ కేసును విన్న సుప్రీం కోర్టు కేసుపై కోర్టు విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించింది. వివరాల్లోకి వెళితే గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య, భార్య తండ్రిపై చీటింగ్ కేసు పెట్టాడు. తన భార్యకు పురుషులకు ఉన్నటువంటి అంగం ఉందని.. ఈ విషయాన్ని దాచిపెట్టి మోసంపూరితంగా తనకు ఇచ్చి పెళ్లి చేశారని భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే 2016లో వాళ్ల పెళ్లి జరిగింది. అయితే.. పెళ్లయిన కొన్ని రోజుల వరకు ముహూర్తం లేదనే నెపంతో అతడికి ఆ యువతితో శోభనం జరగలేదు. కొన్ని రోజుల తర్వాత భర్త బలవంతంతో శోభనం ముహూర్తం ఖరారు చేశారు. తొలి రేయి శృంగారం చేసే సమయంలో భర్త.. ఆమె జననేంద్రియాలను చూసి షాక్ అయ్యాడు. ఆమెకు పురుషులకు ఉండే అంగం ఉందని తెలుసుకున్నాడు. దీంతో భార్యను మెడికల్ చెకప్‌కు తీసుకెళ్లాడు. దీంతో ఆమెకు congenital adrenal hyperplasia అనే డిజార్డర్ ఉందని తేలింది. దీనర్థం మగవాళ్ల అంగం లాంటి అవయవం.. ఆమె జననేంద్రియాల వద్ద ఉంది. ఈ డిజార్డర్ నుంచి బయటపడాలంటే ఆమెకు సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు.
తెలంగాణలో ఒంటిపూట బడులు, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగనున్న స్కూల్స్
దీంతో షాక్ కు గురైన ఆ వ్యక్తి తన భార్యను పుట్టింటికి దగ్గరికి పంపించేశాడు. తనను మోసం చేసి ఆమెతో పెళ్లి చేశారని మండిపడ్డాడు. అయితే తమ కూతురును హింసిస్తున్నాడని యువతి తల్లిదండ్రులు.. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెంటనే తన భార్య, మామ.. ఇద్దరూ మోసం చేసి తన మెడికల్ కండిషన్ గురించి చెప్పకుండా దాచిపెట్టారని ఐపీసీ సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేశాడు.
ఆ తర్వాత ట్రయిల్ కోర్టులో ఈ కేసుపై పలుమార్లు విచారణ జరిగింది. ఆ మహిళ మధ్యప్రదేశ్ హైకోర్టుకు కూడా వెళ్లింది. మధ్యప్రదేశ్ కోర్టు మహిళకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఆమెకు స్త్రీ జనేంద్రియాలు కూడా ఉన్నాయని.. కాబట్టి ఆమె తప్పేమీ లేదని కోర్టు తేల్చి చెప్పింది.
దీంతో అతడు ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదును స్వీకరించిన కోర్టు.. విచారణ కోసం జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎంఎం సుంద్రేష్‌లతో కూడిన బెంచ్‌ను ఏర్పాటు చేసింది. భర్త తరుపు లాయర్ మాట్లాడుతూ.. ఆమె కచ్చితంగా మగ వ్యక్తే అని, ఇది చీటింగ్ కిందికే వస్తుందన్నారు. మెడికల్ రిపోర్ట్స్‌ను చెక్ చేయండి.
ఒక పురుషుడితో మరో పురుషుడికి వివాహం ఎలా చేస్తారు. తన జననేంద్రియాల గురించి తనకు ముందే తెలుసు. అయినా కూడా ఈ విషయాన్ని దాచిపెట్టారు.. అని కోర్టుకు విన్నవించాడు. దీంతో కోర్టు.. ఆ మహిళకు, ఆమె తండ్రికి నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.