Shirdi, April 28: షిర్డీ సాయిబాబా (Shirdi Temple) ఆలయానికి మరింత భద్రత (Security) కల్పించాలన్న సాయి సంస్థాన్ ట్రస్ట్, మహారాష్ట్ర (Maharsatra) పోలీసుల నిర్ణయాన్ని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిని నిరసిస్తూ మే 1 నుంచి నిరవధిక బంద్ నిర్వహించాలని నిర్ణయించారు.
అసలేం జరిగిందంటే?
సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో ఆలయ భద్రతపై బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని కోరగా, సీఐఎస్ఎఫ్ (CISF) భద్రతకు ట్రస్ట్ ఓకే చెప్పింది. అయితే, ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రతను కల్పించాలన్న నిర్ణయాన్ని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా, గ్రామస్థుల సమ్మె ప్రభావం ఆలయంపై ఉండదని, దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.
Shirdi Saibaba Temple | మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్..! మరి సాయిబాబా ఆలయం తెరించే ఉంటుందా..? https://t.co/q9FuYlRLKw
— vidhaathanews (@vidhaathanews) April 28, 2023
ప్రస్తుతం ఆలయ భద్రతా ఏర్పాట్లను సాయి సంస్థాన్ సిబ్బంది పర్యవేక్షిస్తుండగా, ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూస్తున్నారు.