Gold Treasure (Credits: X)

Newdelhi, July 14: కేరళలోని (Kerala) కన్నూరు జిల్లాలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. నీటి కష్టాలు రావొద్దని ముందు జాగ్రత్తగా కొందరు దినసరి కూలీలు వర్షపు నీటి నిల్వ కోసం ఇంకుడు గుంత తవ్వుతుండగా ఆ క్రమంలో కళ్లు చెదిరే గుప్త నిధి (Buried Treasure in Kerala) బయటపడింది. అందులో బంగారం, వెండితో చేసిన ఆభరణాలు బయటపడ్డాయి. పరిప్పాయి ప్రభుత్వ స్కూల్‌ కు సమీపంలోని ఈ ఘటన జరిగింది. తొలుత దాన్ని మందు పాతరగా భావించి భయపడిపోయిన కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వాటిని తవ్వి తీయించిన తర్వాత అది గుప్త నిధి అని తేలింది. ఆ నిధిని అధికారులు శుక్రవారం కోర్టుకు అప్పగించారు. వాటి విలువ, అవి ఏ కాలం నాటివో నిర్ధారించాలంటూ పురావస్తు శాఖకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై కాల్పులు.. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా బుల్లెట్ల వాన.. ట్రంప్ చెవి దగ్గర గాయం.. తీవ్ర రక్తస్రావం.. ఘటనపై బైడెన్, మోదీ ఏమన్నారంటే?? (వీడియో ఇదిగో)

గుప్త నిధిలో ఏమేం ఉన్నాయంటే?

గుప్త నిధిలో 17 ముత్యాల హారాలు, 13 బంగారు లాకెట్లు, నాలుగు పతకాలు, ఐదు పురాతన ఉంగరాలు, ఒక జత చెవి రింగులతో పాటు పలు వెండి నాణెలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

హైదరాబాద్ లోని అశోక్‌ నగర్‌ చౌరస్తాలో కొనసాగుతున్న నిరుద్యోగులు మెరుపు ధర్నా (వీడియో)