Newdelhi, July 7: విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ (Passport) ఉండాలన్న విషయం తెలిసిందే. ఇది గుర్తింపు ద్రువీకరణ పత్రంగానూ సాయపడుతుంది. అయితే, స్పెయిన్ (Spain) ప్రభుత్వం ‘పోర్న్ పాస్ పోర్ట్’ (Porn Passport)ను కొత్తగా తీసుకొచ్చింది. డిజిటల్ వాలెట్ బీటాగా పిలుస్తున్న ఈ పోర్న్ పాస్ పోర్టును 18 ఏండ్లు పైబడిన వారికి అందిస్తారు. ఈ పాస్ పోర్ట్ కింద నెలకు 30 పోర్న్ క్రెడిట్స్ ను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. వీటితో పోర్న్ సైట్లను వీక్షించవచ్చు. క్రెడిట్స్ ఖర్చయిపోతే, అదనపు క్రెడిట్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని కూడా ఉచితంగానే అందిస్తారు.
#Spain is set to launch a mobile application – dubbed #PornPassport – that aims to stop minors from accessing pornographic content
What is it and how does it work? Read: https://t.co/eH9yv78kgC
— Hindustan Times (@htTweets) July 6, 2024
స్వచ్చందమే
అశ్లీల మాధ్యమాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించడం, పోర్న్ వ్యసనాన్ని తగ్గించడం, ఆన్ లైన్ లైంగిక వేధింపుల కట్టడి కోసమే పోర్న్ పాస్ పోర్ట్ ను తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. 18 ఏండ్ల పైబడిన వారికి మాత్రమే పోర్న్ సైట్లలో ప్రవేశాన్ని కల్పించడానికి దీన్ని తీసుకొచ్చారు. అయితే, తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఈ నిబంధనలు ఉన్నాయని స్థానికులు ఈ పాస్ పోర్ట్ జారీని వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఇది స్వచ్చందమేనని అధికారులు ప్రకటించారు.