Fire (Representational image) Photo Credits: Flickr)

New Delhi, FEB 05: ఫైర్‌ బ్రీతింగ్‌..! (fire breathing) దీని గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక రకమైన సర్కస్‌ కళ. ఒక వ్యక్తి తన నోట్లో మండే స్వభావం కలిగిన కిరోసిన్‌ లాంటి ఏదైనా ద్రవాన్ని బుక్కపట్టి.. ఒక చేత్తో మంటను పట్టుకుని, ఆ మంటపైకి నోట్లోని ద్రవాన్ని ఊదుతూ గాల్లో అగ్ని గోళాలను సృష్టిస్తుంటాడు. చూసే ప్రేక్షకులకు ఈ సర్కస్‌ స్టంట్‌ (Stunt) కనువిందు చేస్తుంది. కానీ, ఏమాత్రం పొరపాటు జరిగినా ఆ స్టంట్‌ చేస్తున్న వ్యక్తి ప్రాణాలకే ప్రమాదం. ఫైర్‌ బ్రీతింగ్‌ చేయాలంటే చాలా ప్రాక్టీస్‌ ఉండాలి. ఎంత ప్రాక్టీస్‌ ఉన్నా స్టంట్‌ను ప్రదర్శించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాక ప్రదర్శన ఇస్తున్నంత సేపు ఎంతో ఏకాగ్రతతో వ్యవహరించాలి. ఈ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా రిస్క్‌లో పడటం ఖాయం.

ఓ ఫైర్‌ బ్రీతింగ్ స్టంటర్‌ (fire breathing) అలాంటి పొరపాటే చేశాడు. ఒక కట్టెపుల్లకు బట్టముక్కను చుట్టి కిరోసిన్‌లో ముంచి వెలిగించాడు. ఆ తర్వాత నోట్లో కిరోసిన్‌ను బుక్కపట్టి చేతిలో ఉన్న మంటపై ఉమ్మబోయాడు. ఈ ప్రయత్నంలో చేతిలోని మంటను నోటికి చాలా దగ్గరికి తీసుకురావడంతో నోట్లోని కిరోసిన్‌ కూడా అంటుకుంది. దాంతో అతని ముఖం అంతా మంటలు వ్యాపించాయి.

Viral Video: వీరిలో జంతువు ఎవరో, మనుషులు ఎవరో? ఈ వీడియో చూశాక చెప్పండి: ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ 

వెంటనే చేతిలోని మంటను విసిరేసిన స్టంటర్‌ తన ముఖంపై మంటలను ఆర్పుకునేందుకు ప్రయత్నించినా కొద్ది మరింత ఎక్కువయ్యాయి. వెంటనే ఆ స్టంట్‌ను చూస్తున్నవాళ్లు అప్రమత్తమై మంటలను ఆర్పేశారు. దాంతో స్టంటర్‌కు ప్రాణాపాయం తప్పింది.