BRS Chariot: ఎన్నికల సమరానికి సిద్ధమైన గులాబీ దళపతి కేసీఆర్.. ప్రచార రథం ఫోటోలు వైరల్..
BRS Chariot (Credits: X)

Hyderabad, Oct 15: తెలంగాణలో (Telangana) ఎన్నికల సమరం షురూ అయ్యింది. ఈ కథనరంగంలో అడుగు ముందే ఉన్న గులాబీ దళపతి కేసీఆర్ (KCR).. నేడు ప్రచార పర్వం ప్రారంభించనున్నారు. తాను సెంటిమెంట్‌ గా భావిస్తున్న హుస్నాబాద్ నుంచే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో గులాబీ దళపతి కేసీఆర్ ప్రచార రథం సిద్ధమైంది. ఈ ప్రచార రథానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఈ ప్రచార రథం.

BRS Manifesto Today: నేడు మ్యానిఫెస్టో విడుదల చేయనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. 119 మంది అభ్యర్థులకు బీ-ఫారాలు ఇవ్వనున్న గులాబీ బాస్.. హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభ ద్వారా ప్రచారానికి శ్రీకారం

2023 అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ ప్రచార రథాన్ని  కేసీఆర్ కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బహుమతిగా ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణకు చేరింది ఈ బస్సు.