ఆర్టీసీ చైర్మన్ అలాగే ఐపీఎస్ ఆఫీసర్ అయిన వీసీ సజ్జనార్, తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఓ యువకుడు రైలు పట్టాలపై నిలబడి రైలు సమీపానికి వచ్చేవరకు వేచి చూసి ఆ తర్వాత వెంటనే పక్కకు తప్పుకున్న వీడియో.. ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తోంది. ఆ వీడియో చివర్లో రైలు బోగీ తలకు తగిలి యువకుడు ప్రాణాపాయం కొని తెచ్చుకున్నాడు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవు. క్షణాల్లో ప్రాణం పోయే ఆటలను ఆడుతున్న యువకులను హెచ్చరిస్తూ సజ్జనార్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన ట్విట్ ఇలా ఉంది..
సోషల్ మీడియాలో వైరల్ అయితే అదేదో గొప్పగా ఫీలవుతున్నారు. అందుకోసం వింత వింత చర్యలకు పాల్పడి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కన్నా.. మీ ప్రాణాలు ఎంతో విలువైనవి. పిచ్చి పిచ్చి పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోకండి. మీ కుటుంబానికి శోకాన్ని మిగల్చకండి.
ఇదేం పైత్యం!
సోషల్ మీడియాలో వైరల్ అయితే అదేదో గొప్పగా ఫీలవుతున్నారు. అందుకోసం వింత వింత చర్యలకు పాల్పడి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కన్నా.. మీ ప్రాణాలు ఎంతో విలువైనవి. పిచ్చి పిచ్చి పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోకండి. మీ కుటుంబానికి శోకాన్ని… pic.twitter.com/cgPloaA9Ya
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 8, 2023