Faridabad, June 22: మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ (Drunken Driver) రచ్చ చేశాడు. రోడ్డు మధ్యలో కారు ఆపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. ఆ కారు వద్దకు వెళ్లిన ట్రాఫిక్ పోలీస్ (Traffic police) వాహనం పత్రాలు చూపించాలని డ్రైవర్‌ను అడిగాడు. అయితే తప్పించుకునేందుకు ఆ డ్రైవర్ కారును వేగంగా ముందుకు నడిపాడు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీస్‌ను కొంత దూరం కారుతో ఈడ్చుకెళ్లాడు. (Traffic Cop Dragged) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు మధ్యలో ఆపాడు. ప్రయాణికులను ఎక్కించుకోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా, ట్రాఫిక్ ఎస్‌ఐ దీనిని గమనించాడు. ఆ కారు వద్దకు వెళ్లి డ్రైవర్‌తో మాట్లాడాడు. డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు తెలుసుకున్నాడు. చలానా (Challan) రాసేందుకు వాహనం ప్రతాలు అడిగాడు. అయితే ఆ కారు డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా కారు వేగం పెంచి ముందుకు నడిపాడు. డ్రైవర్ సీటు వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీస్ అధికారిని కొంత దూరం కారుతో ఈడ్చుకెళ్లాడు.
Ballabgarh, Faridabad: When the traffic signal turned red, an Inspector of Traffic Police requested vehicle documents from a driver, sparking a dispute between them. Subsequently, the driver accelerated, dragging the traffic policeman at high speed pic.twitter.com/LsY32fsGJL
— IANS (@ians_india) June 22, 2024
మరోవైపు మిగతా పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించారు. ఆ కారును చుట్టుముట్టారు. ట్రాఫిక్ పోలీస్ అధికారిని కాపాడారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కారు నుంచి బయటకు వచ్చాడు. దీంతో ట్రాఫిక్ ఎస్‌ఐ అతడి చొక్కా పట్టుకుని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లోకి తీసుకెళ్లాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.