ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. బుధవారం వేకువజామున ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బీహార్ నుండి ఢిల్లీ వైపు వెళ్తున్న స్లీపర్ బస్సును మిల్క్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో సుమారు 18 మంది మృతి చెందగా, 19 మందికి గాయాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా బంగార్ మౌ ప్రాంతంలోని జోజికోట్ గ్రామ సమీపంలోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 05:15 గంటలకు బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ బయటకు తీసి చికిత్స నిమిత్తం సిహెచ్‌సి తరలించి మృతదేహాలను స్వాధీనం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది మృతి
ఉత్తరప్రదేశ్ - ఉన్నావ్ దగ్గర లక్నో - ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై మిల్క్ ట్యాంకర్‌ను ఢీకొన్న డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు.
ప్రమాదంలో 18 మంది మరణించగా, 30 మందికి పైగా గాయాలు.. ప్రమాద తీవ్రతకు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డ మృతదేహాలు. pic.twitter.com/5j6T1r4y6G
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2024