
Newdelhi, Feb 14: అమెరికాలోని (America) కాలిఫోర్నియాకు చెందిన హెయిర్ స్టయిలిస్ట్ జెస్సీకా ఆరు నెలల్లో రెండు సార్లు ప్రసవించింది (Birth). ఆమె ఇద్దరి సంతానంలో మొదటి సంతానం వయసు ఒక ఏడాది కాగా.. రెండో సంతానం వయసు ఆరు నెలలు. దీన్ని వైద్య పరిభాషలో సూపర్ ఫెటేషన్ అంటారని జెస్సికా వెల్లడించింది. ఒకసారి గర్భం దాల్చిన మహిళ మళ్లీ గర్భవతి కావచ్చని పేర్కొన్నది. అంటే ఒకే గర్భంలో రెండు పిండాలు ఉండి, ఆ రెండూ వేర్వేరు స్థాయిలో అభివృద్ధి చెంది ఉండొచ్చు. ఇప్పటి వరకు అలాంటి కేసులు ఓ పది మాత్రమే రికార్డయ్యాయి. జెస్సికా కేసు 11వది.
