Uttar Pradesh: సచివాలయంలో కీచకుడు, మహిళ చేయి పట్టి లాగి వేధించిన ఆఫీసర్, వీడియో వైరల్, పట్టించుకోని పోలీసులు, 12 రోజుల తర్వాత నిందితుడి అరెస్ట్..
(Image Credit: Youtube)

లక్నో సెక్రటేరియట్‌లో ఓ మహిళా కాంట్రాక్ట్‌ కార్మికురాలిని వేధిస్తున్న వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఆ మహిళ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాధితురాలు ఇచ్చారామ్ యాదవ్‌ అనే అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. మహిళ అక్టోబర్ 29న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 12 రోజులు గడిచిన తర్వాత మీడియా అంతా కోడై కూసిన అనంతరం నిందితుడు ఇచ్చారామ్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సమాచారం ప్రకారం, లక్నోలోని హసన్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న బాధితురాలు మైనారిటీ వెల్ ఫేర్ విభాగంలో కాంట్రాక్ట్‌ వర్కర్ గా పోస్ట్ చేయబడింది. మైనారిటీ సంక్షేమ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ ఇచ్ఛారాం యాదవ్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. 2018 నుంచి ఇచ్ఛారం నిత్యం వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించింది.

తాజాగా వేధింపుల పరిధి మించిపోయింది. దీంతో బాధితురాలు ఆరోపణలు ఎదుర్కొంటున్నఅధికారి, అకృత్యం చేస్తున్న వీడియోను రహస్యంగా చిత్రించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. అందులో స్పష్టంగా చూడవచ్చు, నిందితుడు బాధితురాలిని వేధిస్తున్నట్లు కనిపిస్తాడు. అంతేకాదు మహిళ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది, కానీ నిందితుడు ఆమెను బలవంతం చేస్తాడు. పైగా ఉద్యోగం నుంచి తొలగిస్తానంటూ బెదిరింపులు సైతం చేసినట్లు బాధితురాలు ఆరోపించింది.

బాధితురాలు హుస్సేన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. ADCP సెంట్రల్ ఖ్యాతి గార్గ్ ప్రకారం, ఈ మొత్తం కేసులో అక్టోబర్ 29 న కేసు నమోదు చేయబడింది. తదుపరి విచారణ జరుగుతోంది.  మహిళ తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి రెండు-మూడు సార్లు పిలిచారు. అయితే బాధితురాలి ఫిర్యాదును పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ వీడియో వైరల్ కావడంతో, పోలీసులు నిందితుడు అండర్ సెక్రటరీ ఇచ్చారామ్ యాదవ్‌ను అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైన 12 రోజుల తర్వాత ఈ అరెస్టు జరిగడం గమనార్హం.