Newdelhi, Sep 24: వర్షాకాలంలో రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో (Potholes) సామాన్యుల వాహనాలు చిక్కుకోవడం చూసే ఉంటాం. అయితే, ఓ కేంద్ర మంత్రికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Union Minister Shivraj Singh Chouhan) ప్రయాణించిన కారు రోడ్డుపై ఉన్న నీటి గుంతలో చిక్కుకున్నది. కొంత సేపటి వరకు ఆ వాహనం ముందుకు కదలలేదు. సెక్యూరిటీ సిబ్బంది గొడుగులు పట్టుకోగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ కారు నుంచి కిందకు దిగారు.
Here's Video:
#WATCH | Jharkhand | Union Minister Shivraj Singh Chouhan's car today got stuck in a muddy pothole amid rains today in Baharagora where he was for a public rally pic.twitter.com/ZYrZanee9K
— ANI (@ANI) September 23, 2024
స్థానికుల సాయంతో..
ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది స్థానికుల సహాయంతో ఆ కారును గుంత నుంచి బయటకు తోశారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ వాహనంలో ప్రయాణం కొనసాగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది కదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ దుర్గమ్మ గుడి మెట్లు శుద్ధి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్