Credits: X

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్ పిల్లలను గుంజీలు తీయమని శిక్ష వేశాడు. దీంతో ఓ విద్యార్థి తండ్రి తన స్నేహితులతో కలిసి పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడి గదిలోనే ఆ ఉపాధ్యాయుడిని చితకబాదాడు. ఈ ఘటన అంతా అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి సీసీటీవీ ఫుటేజీని కూడా స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే నౌబస్తా ప్రాంతానికి చెందిన హనుమంత్ విహార్.ప్రాంతానికి చెందిన ఆకాష్ కుమారుడు సౌత్ సిటీ మోడల్ స్కూల్ లో ఐదో తరగతి చదువుతున్నాడు. ఏదో సమస్యకు శిక్షగా ఉపాధ్యాయుడు అతన్ని గుంజీలు తీయమని ఆదేశించాడు.  పిల్లలు ఇంటికి వెళ్లి తండ్రికి ఈ విషయం చెప్పడంతో, అతను తన స్నేహితులతో పాఠశాలకు చేరుకున్నాడు.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...

ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో కూర్చున్న టీచర్‌తో గొడవకు దిగాడు. ఈ సమయంలో పాఠశాల సిబ్బంది, గార్డులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ, అతడు మాత్రం టీచర్‌ని కిక్‌లు, పంచ్‌లతో కొడుతూనే ఉన్నాడు. దీంతో ప్రిన్సిపాల్‌ శాంతించేందుకు ప్రయత్నించారు కానీ టీచర్ ను చితక బాదేశారు.  దీంతో స్కూల్ సెక్యూరిటీ హనుమంత్ విహార్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.

వీడియో ఇక్కడ చూడండి...

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ విషయంపై ఉపాధ్యాయులు లేదా పాఠశాల యాజమాన్యం నుండి ఇంకా ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు నౌబస్తా ఏసీపీ అభిషేక్ పాండే తెలిపారు. ఫిర్యాదు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.