Karnataka: డబ్బుల కోసం కట్టుకున్న భార్యను స్నేహితులతో శృంగారం చేయమన్న భర్త, కానీ అంతలోనే ఏం జరిగిందంటే..?
కట్టుకున్న భార్యను కాసుల కోసం పరాయి పురుషుల వద్ద పడుకోమని చెపుతున్న ప్రభుద్ధుడు దారుణంగా హత్యకు గురైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆహత్య చేసింది మరెవరో కాదు ఆయన భార్యే కావడం గమనార్హం.
కట్టుకున్న భార్యను కాసుల కోసం పరాయి పురుషుల వద్ద పడుకోమని చెపుతున్న ప్రభుద్ధుడు దారుణంగా హత్యకు గురైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆహత్య చేసింది మరెవరో కాదు ఆయన భార్యే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని బెంగుళూరుకు చెందిన పలార్ స్వామి, అలియాస్ స్వామిరాజ్ బెంగళూరు ఉత్తర తాలూకాలో లేఔట్లు వేసి కోట్ల రూపాయలు ఆర్జించాడు. పలార్ స్వామి ఆరేళ్ల కిందట బ్యూటీషియన్ నేత్ర పరిచయం అయ్యింది. ఆ పరిచయం క్రమేపి శారీరక సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్ళకు నేత్రను వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు ఆరు కోట్ల రూపాయలతో విలాసవంతమైన బంగ్లా నిర్మించి ఇచ్చాడు. గత వారం పలార్ స్వామి సడెన్ గా హత్యకు గురయ్యాడు. కాగా పోలీసుల విచారణలో అతడి భార్య నేత్రనే నిందితురాలు అని తేలింది.
అయితే ఆమె స్వయంగా మాదనాయకనహళ్లి పోలీసు స్టేషన్ కు వెళ్లి తానే తన భర్తను హత్య చేసినట్లు లొంగిపోయింది. కాగా పోలీసులతో ఆమె తన గోడును వెళ్లబుచ్చుకుంది. అందులో తన భర్త పలార్ స్వామి కాసుల కోసం కక్కూర్తి పడి పరాయి పురుషులను సుఖపెట్టమని వేధిస్తున్నాడని, వారి వద్దకు వెళ్లి పడుకోమని చెపుతున్నాడని, అందుకే భర్తను హత్య చేశానని పోలీసుల ముందు నేరం ఒప్పుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Nov 21, 2021 06:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

