జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన ఎక్స్‌3 ఎస్‌యూవీని గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్‌ షోరూం ప్రారంభ ధర రూ. 59.9 లక్షలుగా ఉంది. స్థానికంగా తయారయ్యే ఈ కారు రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో 2–లీటర్‌ ఫోర్‌–సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 252 హెచ్‌పీ సామర్థ్యాన్ని, 350 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 235 కిలో మీటర్ల వేగం ప్రయాణించగలదు. బీఎండబ్ల్యూ ఎక్స్‌ 3కి సంబంధించి డీజిల్‌ మోడల్‌ను తర్వలో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)