స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రిమాండ్ మీద రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి విదితమే. అయితే ఈ అరెస్ట్ మీద ఇప్పటివరకు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇంకా నోరు మెదపలేదు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'చంద్రబాబు అరెస్ట్‌ను ఎన్టీఆర్ పట్టించుకోవడం లేదు, కనీసం ఖండించడం లేదు కూడా! ఇక టీడీపీ భవిష్యత్తు దబిడి దబిడే' అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ కి తారక్ ని ట్యాగ్ చేశాడు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్.. టీడీపీకి దూరంగానే ఉంటూ వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. స్వర్గీయ ఎన్టీఆర్ కోసం నాణెం విడుదల చేసినప్పుడు, ప్రత్యేక ప్రచారాలు, సభలు నిర్వహించినప్పుడు సైతం తారక్ తనకు పట్టనట్లే ఉండిపోయాడు.తాజాగా ఈ అరెస్ట్ పైనా స్పందించకపోవడంతో తారక్.. బాబును లైట్ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది.
Here's RGV Tweet
The fact that @tarak9999 dint even care about condemning @ncbn ‘s arrest clearly proves that future of TDP is DABIDI DIBIDI
— Ram Gopal Varma (@RGVzoomin) September 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)