తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా..చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ కాంట్ర వర్సియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ సెటైరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.ప్రస్తుత ఏపీ సీఎం వై.ఎస్.జగన్‌ను సైకో అని చంద్రబాబు తిడుతుంటారని, ఆ సంగతిని పక్కన పెడితే నిజానికి చంద్రబాబు నాయుడే ఓ సైకో సిక్కు అని అన్నారు రామ్ గోపాల్ వర్మ.
అసలు సిక్కో అంటే అర్థం వేరే ఉందని దాన్ని వివరిస్తూ పాటను రిలీజ్ చేశారు. అయితే ఈ పాటను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిందని చెబుతూ అందులో ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగు దేశంలోకి వచ్చిన సీబీఎన్ మామకు వెన్నుపోటు పోడిచారని, ఆ కర్మ కాలి ఇప్పుడు బాధపడుతున్నాడంటూ, ఏడుస్తున్నాడంటూ ఆ పాటలో లిరిక్స్ ఉన్నాయి.
Here's Video
Happy birthday sir @ncbn here’s ur HISTORY in SickoPsycho Song created by #artificalintelligence https://t.co/HsklDCQhNa
— Ram Gopal Varma (@RGVzoomin) April 20, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)