అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నేడు జరిగిన గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్సవంలో ర్యాప‌ర్ కిల్ల‌ర్ మైక్(Rapper Mike) మూడు అవార్డులు గెలుచుకున్నాడు.అయితే స్టేజ్‌పై అవార్డులు అందుకున్న త‌ర్వాత అత‌న్ని అక్క‌డ ఉన్న సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేని కార‌ణంగా 243(ఏ) పీసీ కింద అత‌న్ని అరెస్టు చేశారు.

ఒక‌వైపు మ్యూజిక్ అవార్డ్స్ షో కొన‌సాగుతుండ‌గానే.. అత‌ని చేతుల‌కు బేడీలు వేసి పోలీసులు తీసుకువెళ్లారు.ప్ర‌స్తుతం అత‌ను లాస్ ఏంజిల్స్ పోలీసులు ఆధీనంలో ఉన్నాడు. కాగా బెస్ట్ ర్యాప్ ఆల్బ‌మ్‌, బెస్ట్ ర్యాప్ సాంగ్, బెస్ట్ ర్యాప్ ప‌ర్ఫార్మెన్స్ కేట‌గిరీల్లో ర్యాప‌ర్ మైక్ అవార్డులు గెలుచుకున్నాడు. సామాజిక న్యాయం, జాత్యహంకారం, న‌ల్ల‌వారికి చెందిన స‌మ‌స్య‌ల గురించి ర్యాపర్ మైక్ త‌న పాట‌ల్లో ఎక్కువగా పాడేవాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)